పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైన్ చేసిన సినిమాల్లో రీమేక్ కథలే రెండున్నాయి. వాటిలో ‘వకీల్ సాబ్’ ఇప్పటికే రిలీజ్ కాగా మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రెండవది. ప్రజెంట్ ఈ చిత్రం సెట్స్ మీద ఉంది. దాదాపు 50 శాతం షూటింగ్ కూడ కంప్లీట్ అయింది. సాగర్ కె చంద్ర ఈ రీమేక్ దర్శకుడు. ఇందులో పవన్ ఒరిజినల్ వెర్షన్లో బిజూ మీనన్ చేసిన పోలీస్ పాత్ర చేయనున్నారు. అయితే మళయాళ వెర్షన్, తమిళ వెర్షన్ మధ్య చాలా తేడా ఉంటుందట. ముఖ్యంగా పవన్ పాత్రలో.
ఒరిజినల్ వెర్షన్లో బిజూ మీనన్ పాత్రకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కొద్దిసేపు మాత్రమే ఉండే ఆ ఫ్లాష్ బ్యాక్ బిజూ మీనన్ పాత్రను మాత్రమే ప్రభావితం చేస్తుంది తప్ప కథ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపదు. కానీ తెలుగులో మాత్రం పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాను మలుపు తిప్పేదిగా ఉంటుందట. పవన్ పాత్రను ఎలివేట్ చేయడంతో పాటు సినిమాను కూడ మలుపు తిప్పుతుందట. ఈ కీలకమైన మార్పును పవన్ కళ్యాణే సూచించారట.
నిజానికి తెలుగు సినిమాల్లో కథానాయకుడి ఫ్లాష్ బ్యాక్ ప్రస్తుతంలో నడిచే కథను తప్పకుండా ఎఫెక్ట్ చేయాలి. అప్పుడే మన ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చుతుంది. అందుకే పవన్ పట్టుబట్టి మరీ ఫ్లాస్ బ్యాక్ ఎపిసోడ్ మార్పించారట. మరి పవన్ అద్దుతున్న ఈ మసాలా ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి. ఇకపోతే ఈ చిత్రంలో పవన్ జోడీగా నిత్యా మీనన్ నటిస్తుండగా రానా ఒక కీలక పాత్ర చేస్తున్నారు.