బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభం !

ఏపీలో నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారంగా రూ.35వేలు, తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తాను ఇప్పటికే చెప్పినట్లుగానే దీక్షకు దిగారు.

పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్ ‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రైతులకు మద్దతుగా ఆయన ఈ రోజు తన ఇంట్లో ఉదయం 10 గంటలకు దీక్షలో కూర్చున్నారు.

రాష్ట్రంలో ఉన్న రైతుల్లో నివర్ తుఫాన్ ‌తో తీవ్రంగా నష్టపోయిన రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని రెండు రోజుల క్రితం పవన్ డిమాండ్ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఈ ఏడాదిలోనే మూడోసారి పంట నష్టపోయి రైతులు తన దగ్గర ఆవేదన వ్యక్తం చేశారన్నారు.

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ప్రభుత్వం స్పందించకపోతే రైతులకు మద్దతుగా ఈనెల 7న నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కానీ డిమాండ్ ‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రైతులకు మద్దతుగా ఆయన ఈ రోజు తన ఇంట్లో ఉదయం 10 గంటలకు దీక్షలో కూర్చున్నారు. తాజాగా దీక్షకు దిగిన సందర్భంగా ఆయన… పార్టీ శ్రేణులకు పిలుపుచ్చారు. నష్టపోయిన రైతుల కోసం విరాళాలు గురించి ప్రతి ప్రజా ప్రతినిధిని అడగండి అన్నారు.