Akira Nandan: పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి మనందరికీ తెలిసిందే. అకీరా నందన్ పవన్ కళ్యాణ్ ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ల కుమారుడు అన్న విషయం తెలిసిందే. అకీరా నందన్ అప్పుడప్పుడు వార్తలు నిలుస్తూ ఉంటారు. కొడుకుకు సంబంధించిన విషయాలను రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే అఖిల నందన ఎప్పుడెప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎప్పటినుంచో ఎంతో ఆత్రుత ఎదురుచూస్తున్నారు. అభినందనలు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో మొదట మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు.
ఆ తర్వాత మధ్యలో డ్యాన్స్ నేర్చుకోవడంతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకోవడంతో నటుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ మెగా ఫ్యామిలీ సన్నిహితులు మాత్రం అకీరా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ గురించి స్పందిస్తూ ఇప్పట్లో నటించే అవకాశాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు. అకీరా నందన్ ప్రస్తుతం చదువుతూ ఉన్నాడని, ముందు ముందు అతడి ఆసక్తిని బట్టి ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ వారు తెలియజేశారు. అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికీ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ తనయుడిగా అకీరా నందన్ ఇప్పటికే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నాడు. అకీరాకి సంబంధించిన ఏ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయినా వెంటనే లక్షల్లో లైక్స్, కామెంట్స్ షేర్ వస్తుంటాయి.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న అకీరా నందన్ ఫోటోలకి విపరీతమైన సోషల్ మీడియా రీచ్ ఉంటుంది. కాగా అకీరా నందన్ కు స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ అచ్చం తండ్రిలాగే ఎప్పటికప్పుడు సింపుల్ గా కనిపిస్తూ సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అకిరా చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటాడు. తాజాగా కూడా అకిరా నందన్ కాశీలో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తల్లి రేణు దేశాయ్ తో కలిసి అకీరా, ఆధ్య ఇంకా వారి స్నేహితులు కాశీ, వారణాసి యాత్రకు వెళ్లారు. అకీరా, ఆద్యలు ఉప ముఖ్యమంత్రి పిల్లల హోదాలో అక్కడ అధికారిక వాహనంతో పాటు అన్ని వసతులు కావాలి అనుకుంటే దక్కుతాయి. కానీ వారు అవేమి వద్దు అనుకుని సింపుల్ గా ఆటో రిక్షాలో రోడ్ల మీద చక్కర్లు కొడుతున్నారు. అకీరా నందన్ కి ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో కాశీలోనూ మొహాన్ని కవర్ చేసుకున్నాడు.
ఆటోలో అకీరా అతడి స్నేహితులు జర్నీ చేస్తున్న వీడియోలతో పాటు, అకీరా కాషాయం ధరించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పవన్ సనాతన ధర్మం అంటూ చెబుతున్న ఈ సమయంలో అకీరా ఇలా కాషాయం ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.చాలా సింపుల్‌గా కాశీ రోడ్ల మీద ఆటోలో జర్నీ చేస్తూ, రోడ్డు పక్కన చాలా సింపుల్‌గా కూర్చుని తింటున్న అకీరా నందన్‌ను చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ సింప్లిసిటీని చూసినట్లుగా అనిపిస్తుందని కొందరు అంటున్నారు. సాదాసీదా జీవనం గడపడంలో పవన్ కళ్యాణ్ ను మించి అకీరా ఉన్నాడంటూ కొందరు ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో అచ్చం తండ్రి లాగే ప్రవర్తిస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.