Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఈయన సినిమాల గురించి మాట్లాడుతూ… ఇకపై తాను సినిమాలు చేస్తాను లేదో డౌటే అంటూ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ గత కొన్ని సంవత్సరాల క్రితం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఈయన రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటూ ఉన్న నేపథ్యంలోనే సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి ఏమాత్రం సమయం లేదు. ప్రస్తుతం ఈయన కాస్త సమయం కల్పించుకొని రాజకీయాలను పక్కనపెట్టి సినిమాలను పూర్తి చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్స్ కనుక పూర్తి అయితే తదుపరి కొత్త సినిమాలకు కమిట్ అవుతానో లేదో అన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈయన సినిమాల పట్ల ఆసక్తి తగ్గించి పూర్తిస్థాయిలో రాజకీయాలపైనే దృష్టి సారించబోతున్నారని స్పష్టమవుతుంది. మరి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ అభిమాన హీరో సినిమాలు చేస్తానో లేదో అంటూ మాట్లాడటం కాస్త నిరాశను కలిగిస్తుంది. అయితే గతంలో ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు రాజకీయాలలో సక్సెస్ అయినప్పటికీ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ కార్యకలాపాలను కూడా నిర్వహించేవారు కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో అలా లేవని, అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని స్పష్టమవుతుంది.
