Actor Ajay: తన ఫస్ట్ సినిమా కౌరవుడు అని, ఖుషి సినిమా సెకండ్ చిత్రం అని ప్రముఖ నటుడు అజయ్ స్పష్టం చేశారు. జ్యోతి అనే డైరెక్టర్ తన తండ్రికి తెలుసు అని, అలా తనకు కౌరవుడు సినిమాలో అవకాశం వచ్చిందని ఆయన చెప్పారు.
ఇకపోతే ఖుషి సినిమాలో తాను చేసిన సీన్లన్నీ పవన్ కల్యాణ్ గారే డైరెక్ట్ చేశారని, శ్రీధర్ రెడ్డి మాస్టార్ అని ఒక వ్యక్తి ఉండేవారని, ఆయన ఇలా సెలక్షన్స్ ఉన్నాయి రమ్మని చెప్తే తాను మెయిన్ విలన్ అయితేనే చేస్తానని గట్టిగా చెప్పినట్టు అజయ్ తెలిపారు. తాను అప్పటికే కౌరవుడు సినిమా చేసి ఉండడంతో, ఆ సినిమాలోనూ మంచి రోలే కావడంతో ఇక ఆ తర్వాత కూడా అవకాశాలు బాగానే వస్తాయని తాను ఊహించినట్టు ఆయన చెప్పారు. అలా సెలక్షన్స్‌కు వెళ్లిపుడు పవన్ కల్యాణ్ గారే తనను సెలక్ట్ చేశారని ఆయన అన్నారు.
ఆ సమయానికి తనకు పవన్ కల్యాణ్ గారితో పాటు పీసీ గారు కూడా తనకు కొంచెం హైలెవల్‌గా భావించేవాడినని అజయ్ తెలిపారు. ముందు నుంచే కెమెరామెన్ అంటే కొంచె ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు అనుకునేవాడినని, ఆ భావనతోనే, ఆ ఇష్టంతోనే పీసీ గారితో వర్క్ చేయడం జరిగిందని, అదే ఉద్దేశంతో ఇష్క్ సినిమా కూడా చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం ఆయనతో కూడా చెప్పానని ఆయన అన్నారు. అలా ఖుషిలో తనకు అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత రాజమౌళి గారి స్టూడెంట్ నెం.1లో అవకాశం వచ్చాయని ఆయన చెప్పారు. అలా తనకు ఆ తర్వాత ఛాన్స్‌లు వస్తూనే ఉన్నాయి. మంచి బ్లాక్ బస్టర్స్ కూడా అని ఆయన తెలిపారు.