చిరంజీవి నో చెప్పిన డైరెక్టర్ కు ఎస్ చెప్పిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ తో సినిమా అంటేనే అదొక ఎప్పటికి తేలని వ్యవహారం. కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. సినిమాలు కంటిన్యూ చేస్తా అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ సినిమా ని ఇంకా స్టార్ట్ చెయ్యలేదు. హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాపై ఇప్పటికి ఎలాంటి క్లారిటీ లేదు.

తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సుజీత్ తో ఒకే సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ‘రన్ రాజా రన్’ సినిమా తర్వాత ‘సాహో’ మూవీ డైరెక్ట్ చేసాడు సుజిత్. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఆఫర్స్ రాలేదు. ఆ మధ్య చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాకు ఛాన్స్ వచ్చింది కానీ ఎందుకో చిరంజీవి సుజిత్ ని తప్పించి మోహన్ రాజా ను దర్శకుడిగా పెట్టుకున్నాడు.

ఇప్పుడున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో మొదలవుతుంది. డివివి దానయ్య, త్రివిక్రమ్ సంయుతంగా నిర్మించే ఈ సినిమాను వచ్చే వేసవి కాలంలో రిలీజ్ చెయ్యొచ్చు.