ఇటీవలే ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్షలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వగా ప్రస్తుతం వాళ్ళు మీడియా ముందు ఎలా ఫెయిల్ అయ్యాము అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
ప్రభుత్వ వైఫల్యం వల్లే రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అని.. వారి భవిష్యత్తును, మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని విలువైన సమయం వృథా కాకుండా ఫెయిల్ అయిన విద్యార్థులకు10 గ్రేస్ మార్కులు ఇవ్వాలి అని అన్నారు. ఇక ఎలాంటి ఫీజు తీసుకోకుండా రీకౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.