పవన్ కళ్యాణ్ ఇవ్వబోయే ఈ ఇంటర్వ్యూ డిఫరెంట్

Pawan Kalyan pre recorded interview for Vakeel Saab
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’ త్వరలోనే రిలీజ్ కానుంది. సినిమా మీద భారీ అంచనాలున్నాయి అభిమానుల్లో.  త్వరలోనే సినిమా ట్రైలర్ విడుదలకానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు మొదలైయ్యాయి.  త్వరలోనే భారీ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఏన్నడూ లేనిది ఇంటర్వ్యూ కూడ ఇచ్చారు.  అయితే ఇది లైవ్ ఇంటర్వ్యూ కాదు.  ప్రీప్లాన్డ్ ఇంటర్వ్యూ.  ముందుగానే రికార్డ్ చేసిన ఈ ఇంటర్వ్యూలో పవన్ అప్రూవ్ చేసిన ప్రశ్నలే ఉంటాయి.  ఎలాంటి పొలిటికల్ టాపిక్స్ ఉండవు.  
 
సాధారణంగా పవన్ ఏ సినిమాకీ ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదు.  వస్తే గిస్తే ప్రీరిలీజ్ వేడుకకు మాత్రమే వస్తారు.  అంతకు మించి ఎక్కడా కనబడరు.  కానీ ఈసారి నిర్మాత దిల్ రాజు పట్టుబట్టి మరీ ఇంటర్వ్యూ సెట్ చేశారు.  రీఎంట్రీ సినిమా కాబట్టి నేరుగా మీరు మాట్లాడితేనే క్రేజ్ ఉంటుందని ఒప్పించారట.ఈ ఇంటర్వ్యూ త్వరలోనే విడుదలకానుంది.  దీని కోసం కూడ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.  పవన్ సినిమాల గురించి మాట్లాడి చాలాకాలమే అయింది.  అందుకే ఈ క్రేజ్.  మరి పవన్ ఈ సినిమా గురించి ఏం మాట్లాడతారో చూడాలి.