Pawan Kalyan OG: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు డిప్యూటీ సీఎంగా రాజకీయాలలో ఫుల్ బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అయితే పవన్ నటిస్తున్న సినిమాలలో ఇటీవల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుని థియేటర్లలో గ్రాండ్గా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.
అయితే మొదట్లో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా చతికిలపడిపోయింది. దీంతో అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. పవన్ నటిస్తున్న మరొక మూవీ ఓజీ. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నుంచి ఫైర్ స్ట్రోమ్అంటూ సాగే తొలి లిరికల్ పాటని విడుదల చేశారు మూవీ మేకర్స్.

పాట గురించి రిలీజ్ ముందు వరకు హైప్ ఎక్కువగానే ఇచ్చారు గానీ తమన్ ఇదివరకే కంపోజ్ చేసిన పాటల లాగానే బాగుంది. కాకపోతే మరీ సూపర్ గా అయితే అనిపించలేదు. అదే టైంలో లిరిక్స్ ని మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. ప్రస్తుతానికైతే అభిమానులకు నచ్చినట్లే కనిపిస్తోంది. రానురాను పాట అలవాటు అవుతుందేమో చూడాలి మరి. ఓజీ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. సుజీత్ దర్శకుడు కాగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. సెప్టెంబరు 25న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి.
