OG Movie Censor: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీకి మరో రెండు రోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. అలాగే టీజర్, ట్రైలర్స్ లోనే పవన్ యాక్షన్ సీక్వెన్స్ లు, డార్క్ మూడ్, ముంబై బ్యాక్ డ్రాప్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ రివెంజ్ స్టోరీ, 1980ల ముంబై గ్యాంగ్‌స్టర్ వరల్డ్ ను రీక్రియేట్ చేస్తూ, అడ్రెనలిన్ రష్ ఇస్తుందని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ఇచ్చింది.
సినిమాలో 8 కట్స్ చేసి, మొత్తం 1 నిమిషం 55 సెకన్లు (115 సెకన్లు) తొలగించారట. అలాగే సినిమా రన్‌టైమ్ 154 నిమిషాలు (2 గంటలు 34 నిమిషాలు 15 సెకన్లు) లాక్ చేశారట. ఇకపోతే తాజాగా విడుదల అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని మూవీ మేకర్స్ తో పాటు అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే అభిమానులు థియేటర్ల వద్ద కటౌట్లు కడుతూ హంగామా మొదలు పెట్టేశారు. మరి ఓజీ సినిమా విడుదల అయ్యి ఎటువంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.
OG Movie Censor: ఓజీ మూవీకి ‘A’ సర్టిఫికెట్.. సినిమాలో ఆ సీన్స్ కట్.. నిడివి ఎంతో తెలుసా?
