Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేదు అయితే తాజాగా చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఈ సినిమా ఆలస్యం కావడం గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
హరిహర వీరమల్లు సినిమా నేపథ్యం చెప్పిన పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ చాలా అద్భుతమైన ఫౌండేషన్ తో నా ముందుకు వచ్చారని ఈ కథ వినగానే నాకు నచ్చి వెంటనే కమిట్ అయ్యానని తెలిపారు. అయితే కొన్ని కారణాలవల్ల కెరియర్ పరంగా వ్యక్తిగత కారణాలవల్ల క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని అయితే ఇంత మంచి కథను తీసుకు వచ్చిన క్రిష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇలా ఈ సినిమా మొదటి డైరెక్టర్ క్రిష్ పేరు గుర్తుపెట్టుకున్నప్పటికీ తర్వాత ఈ సినిమాని టేకప్ చేసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ పేరుని మాత్రం పవన్ కళ్యాణ్ మర్చపోయారు.
ఈ విధంగా జ్యోతి కృష్ణ పేరు మర్చిపోవడంతో కాసేపు మౌనంగా ఉన్న ఆయన వెనుక నుంచి అతని పేరు గుర్తు చేయడంతో తదుపరి జ్యోతి కృష్ణ అని చెబుతూ ఈ సినిమా విజయవంతంగా పూర్తి చేయడంలో జ్యోతి కృష్ణ పాత్ర గురించి వివరించారు అయితే ఏది ఏమైనా మొదటి డైరెక్టర్ క్రిష్ పేరు గుర్తుపెట్టుకొని ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రస్తుత డైరెక్టర్ గీత కృష్ణ పేరు మర్చిపోవడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా సినిమా డైరెక్టర్ పేరు మర్చిపోతే ఎలా అంటూ పలువురు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.
