Dil Raju: పవన్‌ మాటలకు కన్నీళ్లు వచ్చేశాయి.. దిల్‌ రాజు కామెంట్స్ వైరల్!

Dil Raju: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు దిల్ రాజు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ముందు ఉండి వాటికి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటారు. ఇకపోతే నిర్మాత దిల్ రాజు తాజాగా నిర్మించిన సినిమా గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ సినిమా ప్రేమోషన్స్ కార్యక్రమాలలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రోజులు మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ను నేను ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా చూస్తుంటా. తొలిప్రేమ సినీమా నుంచి ఆయనతో నా ప్రయాణం మొదలైంది. దాదాపు 25 ఏళ్ల ప్రయాణం మాది. కెరీర్‌ మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన అలా ఎందుకు చేస్తున్నారని చాలామంది మాట్లాడుకున్నారు. అందులో నేను కూడా ఒకడిని. రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే ఆయనేమీ విజయాన్ని అందుకోలేదు. పరాజయం వచ్చినా ఆయన ఎక్కడా ఆగలేదు. ఎంతో శ్రమించారు. ఇటీవల 21 సీట్లకు 21 గెలుచుకొని ఘన విజయాన్ని అందుకున్నారు.

ఆయనే నిజమైన గేమ్‌ ఛేంజర్‌. సక్సెస్‌ రాలేదని, ఎక్కడా ఆగకూడదని శ్రమిస్తే విజయం తప్పక వరిస్తుందని ఆయన్ని చూశాకే అర్థమైంది. వకీల్‌ సాబ్‌ సినిమా వల్ల వచ్చిన పారితోషికం తమ పార్టీకి ఒక ఇంధనంగా పనిచేసిందని గేమ్‌ ఛేంజర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లో ఆయన నా గురించి చెప్పిన మాటలు విని నాకు కన్నీళ్లు వచ్చేశాయి. ఆయన ఆ విషయాన్ని చెబుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకొని ఆవిధంగా మాట్లాడటం నిజంగా ఆనందాన్ని ఇచ్చింది. ఆయనకు నా పాదాభివందనం అని దిల్‌ రాజు అన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.