HHVM Pre Release Event: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీర మల్లు సినిమా జులై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో వెండి తెరపై సందడి చేస్తూ చాలా సంవత్సరాలవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా జూన్ 12వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడటంతో జూలై 24వ తేదీ విడుదల కానుంది.
ఇక హరిహర వీరమల్లు సినిమా 24వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు. అయితే ఇదివరకు ఈ సినిమా వేడుకను తిరుపతిలో చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు. అయితే సినిమా విడుదల వాయిదా పడటంతో ఇప్పుడు మరోసారి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా వేడుకను తిరుపతిలో చేయాలని భావిస్తున్నారు అయితే ఈ కార్యక్రమాన్ని జులై 20వ తేదీ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది.
అప్పటికే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తిరుపతి లేదా విజయవాడలోనే ఈ సినిమా వేడుకను ఘనంగా నిర్వహించాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు అయితే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నారు ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా కార్యక్రమాలకు వచ్చింది చాలా తక్కువ కేవలం రామ్ చరణ్ సినిమా వేడుకకు మాత్రమే హాజరయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా వేదికపై ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది.
