జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కేంద్రం కల్పించిందని.. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఏ రాష్ట్రానికి వెళ్లినా.. ఆయా రాష్ట్రాల పోలీసులు ఆయనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించాలంటూ కేంద్రం అన్ని రాష్ట్రాల డీజీపీలకు లేఖ రాసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. వెంటనే ఆ వార్తలను చూసిన నెటిజన్లు.. బీజేపీపై నిప్పులు చెరగడం ప్రారంభించారు.
అయితే.. అసలు.. నిజంగా పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారా? కేంద్రం ఆ నిర్ణయం తీసుకుందా? ఈ విషయాన్ని మాత్రం జనసేన కార్యాలయం కొట్టి పారేసింది.
ఇదంతా ఫేక్. కావాలని ఎవరో సృష్టించారు. అసలు.. పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తామని ఎవ్వరూ ఇప్పటి వరకు తమను సంప్రదించలేదు. పవన్ కళ్యాణ్ కూడా తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కావాలని కోరలేదు.. అంటూ జనసేన కార్యాలయం క్లారిటీ ఇచ్చింది.
అసలు.. పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీ భద్రత ఎందుకు? ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు.. అంటూ వైరల్ అయిన ఆ వార్తపై నెటిజన్లు తెగ ఫైర్ అయ్యారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎవ్వరికైనా జెడ్ కేటగిరీ భద్రత ఇస్తారా? అంటూ మరికొందరు ఫైర్ అయ్యారు.