Pawan kalyan fans : టాలీవుడ్ ప్రముఖ హీరో మరియు రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ కోసం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమాలు మరియు తన రాజకీయాలు పరంగా ముందు బాగా కన్ఫ్యూజన్ లో ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు మాత్రం అటు సినిమాలు ఇటు రాజకీయాలు బ్యాలన్స్ చేస్తూ వస్తున్నారు.
సినిమాల్లో తనకి తిరుగు లేదని ఆల్రెడీ భీమ్లా నాయక్ తో ఋజువు చేసిన పవన్ రాజకీయాల్లో మాత్రం ఇంకా జీరో లోనే ఉన్నాడు. అయితే తన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నాడనుకున్నా తర్వాత అతగాడు ఏం చేసాడో కూడా తెలుసు. దీనితో పవన్ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు ఆ ఎమ్మెల్యే ని బాయ్ కాట్ చేసారు.
మరి ఇదిలా ఉండగా ఆ ఎమ్మెల్యే కి పవన్ ఫ్యాన్స్ ఇంకో క్రేజీ షాక్ ఇచ్చారు. ఈరోజు పవన్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ కి తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ కి ఎలాంటి అనుమతి లేదని. ఫోటో వేసి మరీ నో ఎంట్రీ ముద్రలు పెట్టి కింద ఒక అదిరే క్యాప్షన్ కూడా పెట్టారు. అదేమిటంటే ఇట్లు మీ పల్లకి మోసిన రాజోలు జన సైనికులు అని పెట్టారు.
దీనితో ఈ షాకింగ్ ఫ్లెక్స్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ మీటింగ్ కోసం అయితే పవన్ అభిమానులు పెద్ద ఎత్తునే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పవన్ స్పీచ్ కోసం ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ మీటింగ్ తో మళ్లీ పవన్ సినిమాలకి ఏమన్నా ఇబ్బందులు ఎదురు అవుతాయేమో చూడాల్సిందే.