విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్

They are the strength of the Janasena,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయమే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలోని పటమట లంక జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 4లో పవన్ కల్యాణ్ ఓటు వేశారు. పవన్‌ కల్యాణ్‌ తో పాటు ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

AP Municipal Elections: విజయవాడలో ఓటువేసిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబరు 4లో పవన్ ఓటు వేశారు. అలాగే, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం 2,214 డివిజన్, వార్డు స్థానాల్లో 580 ఏకగ్రీవం కాగా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే, నాలుగు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 71 మునిసిపాలిటీలు, 12 నగర పాలక సంస్థల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. బరిలో 7,549 మంది అభ్యర్థులు ఉండగా, 77,73,231 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.