Game changer: గేమ్ ఛేంజర్ సినిమాకు నెగటివ్ రివ్యూ రావడానికి పవన్ కారణమా…..అందుకే ఇలా అయ్యిందా?

Game changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. జనవరి 10వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఎంతో మంది మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు ఇలాంటి స్పందన రావడానికి కారణం ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ కారడం అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన సినిమాల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సినిమాల పట్ల చూపిన వివక్షత గురించి మాట్లాడుతూ జగన్ పై విమర్శలు చేశారు.

ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కొంతమంది మెగా వైసీపీ అభిమానులు పూర్తిస్థాయిలో ఈ సినిమాని వ్యతిరేకించారు. ఇదంతా పవన్ కళ్యాణ్ వల్లనే జరిగిందని చిరంజీవి ఫోటో పెట్టుకున్న కొంతమంది వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. ఇక ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలను పూర్తిస్థాయిలో తప్పుపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ తన పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఈ పది సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో సినిమాలలో నటించారు. అయితే ఆ సినిమాలన్నీ కూడా చాలా మంచి సక్సెస్ అందుకున్నాయి. పవన్ జగన్ గురించి మాట్లాడటం వల్లే సినిమా ఫెయిల్ అయింది అనేది నిజం కాదని సినిమా బాగుంటే ఎవరు ఎన్ని మాట్లాడినా ఆ సినిమా సక్సెస్ ఆపలేరని, అలాగే సినిమాలో కంటెంట్ లేకపోతే ఎంతమంది ప్రమోట్ చేసిన సినిమా సక్సెస్ కాదని కామెంట్లో చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా కోసం రాంచరణ్ తన మూడు సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేసుకున్నారు అంటూ అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.