Pawan Kalyan: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి ఏమాత్రం కృతజ్ఞత లేదు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారా? అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని ఎలా ఛీ కొట్టిందో మర్చిపోయారా? ఇకపై ఇండస్ట్రీకి చెందిన వారెవరు కూడా ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలకు రావద్దు అంటూ పవన్ కళ్యాణ్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంతో గౌరవం ఇచ్చి ఇక్కడ కూడా పరిశ్రమ అభివృద్ధి చేయాలని తపన పడుతుంటే సినీ పరిశ్రమకు మాత్రం ప్రభుత్వం అంటే ఏమాత్రం గౌరవ మర్యాదలు లేకుండా పోయాయని తెలిపారు.కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా కలవలేదని తెలిపారు. సినిమా విడుదలకు ముందు టికెట్ల రేట్ల విషయంలో మినహా ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా కలవలేదని తెలిపారు.
ఇకపై ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి అలాగే సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయం గురించి కూడా ఎవరు వ్యక్తిగతంగా మా వద్దకు వచ్చి కలవద్దు అంటూ ఈయన వార్నింగ్ ఇవ్వడంతో ఒకసారిగా ఇది కాస్త సంచలనంగా మారింది.. ఇలా పవన్ కళ్యాణ్ చిత్రపరిశ్రమ గురించి చేసిన ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. మరి పవన్ వ్యాఖ్యలపై సినీ దర్శక నిర్మాతల స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.