Pawan Kalyan Biggest Mistake : పవన్ కళ్యాణ్‌తో ‘తీన్‌మార్’ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ కృతికర్బందా. అంతకు ముందే సుమంత్‌తో కలిసి ‘బోణీ’ సినిమాలో నటించిందీ అందాల బొమ్మ. అయితే, తెలుగులో స్టార్‌డమ్ దక్కించుకోలేదు. హిందీ, కన్నడ సినిమాలతో ప్రస్తుతం ఓ మోస్తరు బిజీగా గడుపుతోంది.
తెలుగు సినీ పరిశ్రమ అంటే తనకెంతో ఇష్టమనీ, మంచి అవకాశం వస్తే, తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నాననీ కృతికర్బందా చెప్పుకొచ్చింది. అయితే, తెలుగులో ఆమెకు అవకాశాలు రాకపోవడానికి ఓ కారణం వుందంటారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కృతి కర్బందా ‘బ్రూస్‌లీ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్‌కి అక్క పాత్రలో కృతి నటించింది. నిజానికి ఇంపార్టెన్స్ వున్న పాత్రే ఇది. కానీ, ఈ క్యారెక్టర్ చేయడం వల్లనే తెలుగులో కృతి కెరీర్ నాశనమైందనే ప్రచారం వుంది. హీరోయిన్ ఇమేజ్‌కి ఆ క్యారెక్టర్ అంత డ్యామేజ్ తెచ్చిపెట్టిందంటారు.
ఆ తర్వాత కృతి కర్బందా తెలుగులో కనిపించలేదు. నిజమేనా.? ఆ క్యారెక్టర్ కృతికి అంత డ్యామేజ్ చేసిందా.? అదే విషయం ఆమె వద్ద ప్రస్థావిస్తే, ‘బ్రూస్‌లీ’ సినిమా తనకెంతో ప్రత్యేకమైనదనీ, లక్కు కలిసి రాకపోతే ఒక్కోసారి అలాగే వుంటుంది. కానీ, ఆ సినిమా కారణంగా తన కెరీర్ డ్యామేజ్ అయ్యిందంటే అప్సలు ఒప్పుకోననీ కుండ బద్దలుకొట్టేసింది కృతి కర్బందా.