Pawan Kalyan: తెలుగు ప్రేక్షకులకు ఏపీ డిప్యూటీ సీఎం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటూ ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇలా ఒక వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో రెండు పడవలపై ఒకేసారి ప్రయాణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇలా రెండింటితో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నారు.
ఇప్పుడిప్పుడే రాజకీయాలకు కాస్త విరామం ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే తాను కమిట్ అయిన సినిమాలను త్వర త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ లాంటి సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలను వీలైనంత తొందరగా పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్. ఇలా సినిమాలో డబ్బింగ్ పనులు షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు రాజకీయాలలో పాల్గొంటున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో పవన్ కళ్యాణ్ పద్ధతిగా పంచ కట్టులో కనిపించి మెరిసారు. తమిళనాడు మధురైలో మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో నిర్వహించగా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పంచెకట్టుతో స్పెషల్ గా నిలిచారు. పంచ కట్టులో సూపర్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ ఫోటోలను చూసిన అభిమానులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అభిమానులు ఆ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..