Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఈ నెల 27వ తేదీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
వీరిద్దరి కూడా మంగళగిరిలోని తాడేపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అధినేతలు, పార్టీ కీలక నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికలకు మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. ఎందుకంటే ఈయన పట్టభద్రుడు కాకపోవడంతోనే ఈ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే పట్టభద్రుడిగా నమోదై ఉండాలి. పవన్ కల్యాణ్ విద్యా అర్హతలు ప్రస్తుత ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతోనే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఓటు హక్కు పులివెందులలో ఉన్న నేపథ్యంలో ఈయన కూడా తన ఓటు హక్కును వినియోగించుకోని అవకాశాలు లేవని తెలుస్తోంది. విద్యావంతుల ప్రతినిధులుగా ఎమ్మెల్సీలు ఎన్నికవుతుండటంతో ఈ ఎన్నికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది.