Pawan Kalyan: మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిపాడు జిల్లా జనసేన ఇన్చార్జ్ అక్కడ సీహెచ్ సీ లోని వైద్యురాలి పై తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగడమే కాకుండా ఆమె పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందిస్తూ జనసేన నేతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.
పత్తిపాడు జిల్లాలో జనసేన నాయకుడు తమ్మయ్య బాబు శనివారం స్థానిక సిహెచ్ సీ కి వెళ్లారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి లేడీ డాక్టర్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు కురిపించారు అక్కడ ఉన్నది ఒక మహిళ అనే విచక్షణ కూడా కోల్పోయిన తమ్మయ్య బాబు మహిళా డాక్టర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు అది కూడా మహిళా దినోత్సవం రోజున ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇలా ఈ వివాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళ దినోత్సవం రోజు డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ పై నోరు పారేసుకోవడం ఏంటని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తం అయ్యాయి.అయితే ఈ ఘటనపై జనసేన నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్తిపాడు ఘటన పై స్పందిస్తూ..జనసేన ఇన్చార్జి వరుపుల తమ్మయ్య బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యవహార శైలి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆయన పట్ల చట్టపరమైన చర్యలను తీసుకోవాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు.అంతేగాక ప్రత్తిపాడు సీహెచ్‌సీ వైద్యురాలు డా. శ్వేత పట్ల జనసేన ఇన్చార్జి తీరుపై విచారించి తక్షణమే నివేదిక సమర్పించాలి అంటూ కాకినాడ జిల్లా ఇన్చార్జ్ కు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.