Pawan Heroine : అనూ ఇమ్మాన్యుయేల్: ప్లాన్ మార్చేసిన పవన్ హీరోయిన్

Pawan Heroine : ‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. అంచెలంచెలుగా అవకాశాలు దక్కించుకుంటూ, అతి కొద్ది సమయంలోనే ఈ ముద్దుగుమ్మ స్టార్ హోదా దక్కించేసుకుంది. స్టార్‌డమ్ వచ్చినట్లే వచ్చి, అదేంటో చేజారిపోయింది అనూ ఇమ్యాన్యుయేల్ విషయంలో.

చిన్న హీరోలతో అవకాశాలు దక్కించుకుంటూ వెళుతున్న సమయంలోనే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన అనూహ్యంగా అవకాశాలు దక్కించుకుంది. విచిత్రంగా అక్కడి నుంచే అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్ పాతాళానికి పడిపోతూ వచ్చింది. చివరకు కొన్నాళ్లు మాయమైపోయింది కూడా.

ఇప్పుడిప్పుడే, మళ్లీ అవకాశాలు దక్కించుకుంటోన్న అనూఇమ్మాన్యుయేల్, తెలుగులో ఓ రెండు  కొత్త సినిమాలకు కమిట్ అయ్యిందట. హీరోయిన్‌గా ఆ ముచ్చట అటుంచితే,  కెరీర్‌‌కి సంబంధించిన అనూ ఇమ్యాన్యుయేల్ న్యూ టర్న్ తీసుకుందని తెలుస్తోంది. యాక్టింగ్ సంగతి ఎలా వున్నా, ప్రొడక్షన్ ప్లానింగ్‌లో రాణించాలనుకుంటోందట.

ఆల్రెడీ ఆ దిశగా అనూ ఇమ్మాన్యుయేల్ అడుగులు మొదలు పెట్టినట్లు సమాచారం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఓ చిన్న సినిమాని ప్రొడక్షన్ చేసే యోచనలో అనూ ఇమ్మాన్యుయేల్ వుందట. త్వరలోనే ఆ డీటెయిల్స్ ప్రకటించనుందట ఈ ముద్దుగుమ్మ.

బేసిగ్గా ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా అంతంత మాత్రం అనిపించుకున్నా, నిర్మాతగా తన టార్గెట్ రీచ్ అవుతుందా.? చూడాలి మరి.