Pathan Official Trailer : పఠాన్ వచ్చేశాడు!

Pathan Official Trailer : దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్ పైకి వస్తున్న కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ న్యూ యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్‘ టీజర్, ట్రైలర్ వెనువెంటనే రిలీజ్ అవడంతో సంచలనం రేగుతోంది. షారూఖ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో బిజీ అయిపోయారు. టీజర్, ట్రైలర్ లు వైరల్ చేసేసి బిగ్ స్క్రీన్ మీద ‘పఠాన్’ గా షారూఖ్ ని చూసేందుకు ఆగలేక పోతూ ట్వీట్లు చేస్తున్నారు.

విశేషమేమిటంటే, టీజర్ లో షారూఖ్ కనిపించడు. బ్లర్ చేసిన అతడి విజువల్సే కనిపిస్తాయి. ఇదే చెప్పలేని ఉత్కంఠ రేపితే, ఇక ట్రైలర్ లో చివర్లో మాత్రమే కొన్ని క్షణాలు కనిపించడంతో ఫ్యాన్స్ పిచ్చెత్తి పోతున్నారు. ఇలా కొసరి కొసరి చూపించడమేమిటా అని అలకపాన్పు ఎక్కుతున్నారు.

టీజర్ జాన్ అబ్రహాం, దీపికా పడుకోన్ లు పఠాన్ ని పరిచయం చేసే విజువల్స్ తో వుంది… “మన దేశంలో మన పేరును మతం ఆధారంగానో, కులం ఆధారంగానో పెడతారు… అతడికి పేరు పెట్టడానికి కూడా ఎవరూ లేరు. అతడి దగ్గరేమైనా వుందంటే అది ఒకే ఒక్క దేశమే – ఇండియా! … నా నేస్తం తన దేశాన్నే తన మతంగా స్వీకరించాడు.

Pathaan | Official Concept Trailer | Shah Rukh Khan | Deepika P | Salman Khan | John A | Siddharth

 

దేశ రక్షణే తన ధర్మంగా భావించాడు. పేరులేని వాడికి అతడి ధర్మమే గుర్తింపు నిస్తుంది… ఎక్కడ పెరిగాడు, ఎలా పెరిగాడు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. త్వరలో కలుద్దాం!” అన్న డైలాగ్స్ తో – షారూఖ్ వస్తుంటే బ్లర్ చేసిన విజువల్స్ తో టీజర్ ముగుస్తుంది.

ట్రైలర్ లో కూడా షారూఖ్ పాత్రని వర్ణిస్తూంటే యాక్షన్ సీన్స్ వస్తూంటాయి. ట్రైలర్ పూర్తిగా షారూఖ్ కన్పించని యాక్షన్ సీన్స్ తో నిండి వుంది. చిట్ట చివర్లో మాత్రమే కన్పిస్తాడు. పఠాన్ గా రివీల్ అవుతాడు. ఇలా స్టార్ ని వూరిస్తూ వూరిస్తూ చూపించడమనే మార్కెటింగ్ వ్యూహంతో టీజర్, ట్రైలర్లు విడుదల చేయడం ఇదే మొదటిసారి కావచ్చు.

షారూఖ్ ఖాన్ తో బాటు జాన్ అబ్రహాం, దీపికా పడుకోన్, డింపుల్ కపాడియా నటిస్తున్న ‘పఠాన్’ కి రచన, దర్శకత్వం సిద్ధార్థ్ ఆనంద్. సంగీతం విశాల్ దద్లానీ, ఛాయాగ్రహణం బెంజమిన్ జాస్ఫర్. నిర్మాతలు ఆదిత్యా చోప్రా, అలెగ్జాండర్ డోస్టల్ తదితరులు. ఇంతకీ విడుదల ఎప్పుడంటే, జనవరి 25, 2023…!! చాలా టైముంది… ఈలోగా టీజర్, ట్రైలర్ చూసెయ్యండి!

Pathaan | Date Announcement | Shah Rukh Khan | Deepika Padukone | John Abraham