బుల్లితెర మీద ప్రసారమౌతున్న ఎన్నో షోలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఈ టీవీ షోల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా ఎంతో మంది తమ టాలెంట్ ని నిరూపించుకోటానికి వేదికగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో జీ తెలుగులో ప్రసారం అవుతున్న సరిగమప సింగింగ్ షో ద్వారా కూడా ఎంతోమంది సింగర్ గా తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలలో కష్టం చేసుకుని బ్రతికే వారిలో ఉన్న ప్రతిభని బయటకు తీయటానికి ఈ ప్రారంభించారు. ఇలా ఈ షో ద్వారా సింగర్ గా గుర్తింపు పొందిన వారిలో పార్వతి కూడా ఒకరు.
మారుమూల గ్రామంలో కూలి పనులు చేసుకుని బతికి పార్వతి ఇప్పుడు సింగర్ గా పాపులర్ అయింది. ఆమెలో ఉన్న ప్రతిభకు మెచ్చి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు వారి ఊరికి బస్సు వేయించారు. ‘ఊరంతా వెన్నెల మనసంతా చీకటి’ అంటూ తన గాత్రంతో అందరిని మంత్రముగ్దుల్ని చేసిన పార్వతి అనూహ్యంగా ఈ షో నుండి ఎలిమినేట్ అయింది.
పార్వతి ఎలిమినేట్ అవటంతో అభిమానులు నిరాశ చెందారు. మధురమైన గాత్రంతో సింగర్ గా స్థిరపడి పోతుంది అనుకున్న ఆమె ఇలా ఎలిమినేట్ అవటంతో ప్రేక్షకులు కూడా నిరాశా చెందారు.
కానీ ఇటీవల సరిగమప యాజమాన్యం వారు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా మళ్లీ ఈ షోలో రీ-ఎంట్రీ ఇచ్చి పాడే అవకాశం కల్పించారు . ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆరు మంది కంటెస్టెంట్ లు షేక్ రసూల్, కళ్యాణి, చరణ్ తేజ్, పార్వతి, కీర్తన, అర్జున్ విజయ్ లకు పాడే అవకాశం కల్పించారు. దీంతో పార్వతి గొంతు మళ్లీ సరిగమప స్టేజి మీద వినిపించింది. ఇక పార్వతి పాడిన పాటకు ఇంప్రెస్స్ అయిన ఎస్పి శైలజ ఆమెకి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎస్పి శైలజ మాట్లాడుతూ.. సన్మానాలు వంటివి పక్కన పెట్టి ముందు సాధన మీద దృష్టి పెట్టు . సంగీతం విషయంలో నీకూ ఎటువంటి సహాయం కావాలన్నా నిర్మొహమాటంగా నా దగ్గరికి రావచ్చు. నేనెప్పుడు నీకు అందుబాటులో ఉంటాను అంటూ హామీ ఇచ్చింది. దీంతో అక్కడున్న వారితో పాటు ఆమె అభిమానులు కూడా ఖుషి అయ్యారు.