ఏ నాయకుడైనా ఒక జిల్లాకి పర్యటనకు వెళుతున్నాడు అంటే అక్కడి లోకల్ లీడర్లను అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలి. అందరినీ కలుపుకుని పోవాలి. ఇష్టమైనవారు ఉన్నా అందరినీ సమానం దృష్టితోనే చూడాలి. ఈ సంగతి చంద్రబాబుకు తెలిసినంతగా లోకేష్ బాబుకు తెలియదు. అందుకే అనంతపురం పర్యటనను ఆగం చేసి వచ్చారు. జిలాలో వరదల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి చంద్రమబ్బుకు లోకేష్ ను రంగంలోకి దింపారు. లోకేష్ కూడ జనంతో మేమకమై వాళ్ళ బాధలు తెలుసుకున్నారు. జనం వరకు ఈ టూర్ సక్సెస్ అయినా లీడర్ల విషయంలో మాత్రం అసంతృప్తి రగులుతోంది.
అందుకు కారణం లోకేష్ కొంతమంది నేతలతోనే ఎక్కువ సంశయం గడపడం. వారినే పక్కన పెట్టుకుని పర్యటన చేయడం. అనంత టూర్లో మొదటి నుండి చివరివరకు లోకేష్ పక్కన ఉన్నది జేసీ పవన్. హైదరాబాద్ నుండి లోకేష్ తో కలిసి వచ్చిన పవన్ అంతా తానై పర్యటనను పర్యవేక్షించారు. జేసీ కుటుంబానికి వైసీపీలో చాలా వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది పరిటాల కుటుంబం. తరాల తరబడి పరిటాల ఫ్యామిలీకి జేసీ బదర్స్ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. అయినా చంద్రబాబు వారిని పార్టీలోకి తీసుకువచ్చారు. అక్కడే చంద్రబాబు మీద వారికున్న సగం అభిమానం ఆవిరైంది.
ఇప్పుడు లోకేష్ పర్యటనలో పరిటాల సునీతకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. అంతా జేసీ పవన్ హవానే. అక్కడే పరిటాల వర్గం బాగా నొచ్చుకుంది. ఎంతకాదనుకున్నా లోకేష్ భవిష్యత్ సారథి. ఆయన నుండి ప్రతి ఒక్కరూ అటెంక్షన్ కోరుకుంటారు. ఆ అటెంక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత లోకేష్ కు ఉంది. కానీ ఆయన మాత్రం పవన్ మీద నుంచి చూపు మరల్చలేదు. పక్కనే పెట్టుకుని తిరిగారు, పక్కనే ఉంచుకుని మాట్లాడారు, పక్కనే కూర్చోబెట్టుకుని తిన్నారు. పక్కనే ఉంచుకుని బయల్దేరారు. అందుకే ఈ అసంతృప్తి. కనుక ఇప్పటికైనా లోకేష్ వెళ్లే చోటు ఎలాంటిది, అక్కడ ఏయే వర్గాలు ముఖ్యమైనవి అనేది గుర్తించి అందరికీ సమాన ప్రాముఖ్యత ఇస్తే సత్పలితాలు దొరుకుతాయి.