‎Pandu Master: అమ్మాయిలు ఇంస్టాలో మెసేజ్ చేసి నన్ను బ్యాడ్ చేసేవారు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన పండు!

‎Pandu Master: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ సోషల్ మీడియాలో మంచి తో పోల్చుకుంటే చెడుని ఎక్కువగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఎక్కువమంది తప్పుడు పనుల కోసం ఈ సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా కొంతమంది చేసే పనులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇప్పుడు సెలబ్రిటీలను, మాములు ప్రేక్షకులు సోషల్ మీడియా బాగా దగ్గర చేయడంతో ఫ్యాన్స్, జనాలు సెలబ్రిటీలకు డైరెక్ట్ గా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో మెసేజ్ లు చేస్తున్నారు.

‎అంతేకాకుండా సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తరువాత సెలబ్రిటీలకు, అభిమానులకు ఉన్న గ్యాప్ చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పాలి. ఆ సంగతి పక్కన పెడితే మనందరికి ఢీ ఫేమ్ పండు గురించి తెలిసిందే. ఈ షో ద్వారా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పండు. ఈ షోతో పాటుగా చాలా షోస్ లో డాన్స్ తో పాటు కామెడీ కూడా చూస్తూ బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పండు సోషల్ మీడియాని ఉపయోగించి తనను అమ్మాయిలు కొంతమంది బ్యాడ్ చేసినట్టు చెప్పుకొచ్చారు.

‎ఈ సందర్బంగా పండు మాస్టర్ మాట్లాడుతూ.. కొంతమంది అమ్మాయిలు నాకు హాయ్ అని మెసేజ్ చేస్తారు. సరే ఫ్యాన్స్ చేస్తారు కదా అని నేను హాయ్ అని మెసేజ్ పెడతాను. అప్పుడు వాళ్ళు పెట్టిన మెసేజ్ డిలీట్ చేసి మళ్ళీ నా మెసేజ్ కింద హాయ్ అని పెట్టి స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఆ స్క్రీన్ షాట్ అందరికి చూపించి, సోషల్ మీడియాలో స్టోరీలు పెట్టి పండు నాకు మెసేజ్ చేసాడు అని నన్ను బ్యాడ్ చేస్తారు. మెసేజ్ చేసింది ఫస్ట్ వాళ్ళు కానీ నేను చేసినట్టు క్రియేట్ చేస్తారు. అలాంటి అనుభవాలు అయ్యాక నేను ఇన్‌స్టాగ్రామ్ లో వ్యానిష్ మోడ్ వాడుతున్నాను. అందులో వాళ్ళు స్క్రీన్ షాట్ తీస్తే తెలిసిపోతుంది. అప్పుడు నేను స్క్రీన్ షాట్ ఎందుకు తీసావు అని గట్టిగా అడుగుతాను అని తెలిపాడు. ఈ సందర్బంగా పండు చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.