Pan India Star Prabhas : ఉన్నపళంగా ఓ పెద్ద హిట్ కావాలి ప్రబాస్‌కి ఇప్పుడు. ‘రాధేశ్యామ్’ సినిమాతో దారుణంగా డిజప్పాయింట్ అయ్యాడు ప్రబాస్. ఆ మాటకొస్తే, ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టనే లేదు ప్రబాస్. ప్యాన్ ఇండియా స్టార్ అన్నట్యాగ్ మాత్రమే తన పేరు ముందు కనిపిస్తోంది తప్ప.. సక్సెస్‌ల్లో ఆ స్థాయి చూపించలేకపోతున్నాడు ప్రబాస్.
‘మిర్చి’, డార్లింగ్’, తదితర సినిమాలతో ప్రబాస్ అందరితోనూ డార్లింగ్ అనిపించుకున్నాడు. క్లాస్radhe , మాస్ అనే తేడా లేకుండా ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు ప్రబాస్.
కానీ, ఇప్పుడు పరిస్థితి చేయి జారిపోయేలా వుంది. వున్నదీ పోయే, వుంచుకున్నదీ పాయె.. అన్న చందంగా మారిపోయింది ప్రబాస్ ఇమేజ్.
త్వరగా మేల్కోకపోతే, ప్రబాస్ ఇమేజ్‌కి పూర్తిగా డ్యామేజ్ ఏర్పడేలా కనిపిస్తోంది. ప్యాన్ ఇండియా మాటేమో కానీ, ఇప్పటికిప్పుడు కనీసం తెలుగు ఆడియన్స్‌ని అయినా తన వైపుకు తిప్పుకోవాలంటే, మాస్ పల్స్ బాగా తెలిసిన త్రివిక్రమ్, కొరటాల, బోయపాటి, సుకుమార్ లాంటి డైరక్టర్లతో ప్రబాస్ సినిమా చేయాలి.
ఆ వేటలోనే ప్రబాస్ వున్నట్లు తెలుస్తోంది. ఆరు నుంచి ఎనిమిది నెలలలోపే సినిమా పూర్తయిపోయేలా స్కెచ్ వేస్తున్నాడట ప్రబాస్. కానీ, పైన చెప్పుకున్న డైరెక్టర్లలో ఎవ్వరూ ఇప్పుడు ఖాళీగా లేరు.
అందరూ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. పాపం ప్రబాస్. పెద్ద చిక్కే వచ్చి పడింది. ఈ చిక్కు ముడి నుండి తప్పించుకుని, తన ప్యాన్ ఇండియా ఇమేజ్‌ని ఎలా కాపాడుకుంటాడో ప్రబాస్ చూడాలి మరి.