పాన్ ఇండియా సినిమా అంటే మనకు నచ్చాల్సింది కాదు.. ప్రేక్షకులకు నచ్చాలి: నాని

నాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఈయన సినిమా టికెట్ల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున తీవ్ర దుమారం రేపాయి. నాని చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు ఘాటుగా స్పందిస్తూ విమర్శలు చేశారు. ఇకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా వివాదం చెలరేగుతున్న సంగతి మనకు తెలిసిందే. జాతీయ భాష హిందీ కాదంటూ ప్రస్తుతం ఎంతో మంది ఈ విషయం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వారి అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నాని అంటే సుందరానికి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ మరోసారి పాన్ ఇండియా సినిమాలు గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాల పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ..పాన్ ఇండియా సినిమా అంటే మనం కథను ఎంపిక చేసుకొని అన్ని భాషలలో తెరకెక్కించి పాన్ ఇండియా అంటే సరిపోదు.మనం చేసిన సినిమా ప్రేక్షకులకు నచ్చాలి అప్పుడే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది అని తెలిపారు.

భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమాని ఆదరించినప్పుడే అదే అసలైన పాన్ ఇండియా చిత్రం అవుతుందని ఈ సందర్భంగా నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉదాహరణకు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాని ఆదరించారు. కథ బాగుంటే ఏ భాష చిత్రాన్ని అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని,ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాలు గురించి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇకపోతే ఈయన నటించిన అంటే సుందరానికి సినిమా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.