Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు రైతుబిడ్డ అంటూ పెద్ద ఎత్తున యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యారు ఇలా పొలంలో పనులు చేసుకుంటూ రైతు జీవితం ఎంత కష్టంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ అంటూ ఈయన ఎన్నో వీడియోలు షేర్ చేసేవారు. అయితే ఇలా వీడియోల ద్వారా తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ఉంది సపోర్ట్ చేయండి అంటూ కోరారు అయితే చివరికి ఈయన మాత్రం బిగ్ బాస్ కార్యక్రమానికి హాజరయ్యారు .
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనటమే కాకుండా ఈయన చివరికి విన్నర్ గా నిలిచారు. ఇక బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ లైఫ్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఒకప్పుడు రైతుబిడ్డగా జీవనం గడిపిన ఈయన ప్రస్తుతం మాత్రం సెలబ్రిటీ హోదాలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే పల్లవి ప్రశాంత్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.
ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ ని స్టార్ సెలెబ్రిటీలు ప్రమోట్ చేయకూడదని చాలా కఠినమైన నియమం పెట్టింది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతో మంది అమాయక యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ వీసీ సజ్జనార్ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అన్వేష్ పల్లవి ప్రశాంత్ గుట్టు మొత్తం రట్టు చేసే పనిలో పడ్డాడు. ఇతను గతంలో రెండు బెట్టింగ్ యాప్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడని, ఇతన్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నాకు మెసేజ్ చేశాడని, ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాను, దయచేసి నాకు సపోర్ట్ చేస్తూ ఒక వీడియో వేయండి అని అడిగాడని, నేను అలాంటివి ప్రోత్సహించను బ్రదర్ అని చెప్పానని, తెలిపారు. అయితే తను హౌస్ లోకి వెళ్ళిన తర్వాత రైతుబిడ్డ అంటూ సింపతి డ్రామాలు చేస్తూ గెలిచారు. కప్పు గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తం రైతులకే పంచుతానని అబద్ధం చెప్పారు.. ఇక తను గెలిచిన తర్వాత బయటకు వచ్చే రైతులకు సహాయం చేయడం పక్కనపెట్టి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారని అన్వేష్ తెలిపారు.
ఈ విషయంలో పల్లవి ప్రశాంత్ కి కచ్చితంగా శిక్ష పడాలని తెలిపారు ఈ విషయంలో ఆయనపై కేసు కనుక బుక్ అయితే కచ్చితంగా రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని అందుకు పల్లవి ప్రశాంత సిద్ధంగా ఉండాలని అన్వేష్ పల్లవి ప్రశాంత్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.