Pahalgam: ఉగ్రదాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్లే కారణం… మరో వీడియో వదిలిన అన్వేష్!

Pahalgam: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. బైరసన్ వ్యాలీలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ ఘటన గురించి నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ అన్వేష్ సంచలనమైనటువంటి వీడియోను విడుదల చేశారు.

ఇందులో భాగంగా ఈయన ఉగ్రవాద దాడి గురించి మాట్లాడారు. ఇలా పహాల్గంలో జరిగిన ఈ ఉగ్ర దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్లే కారణం అంటూ అన్వేష్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సంచలనగా మారింది. అదేవిధంగా ఆ ముగ్గురు కంటెస్టెంట్ ల ఫోటోలను కూడా బయటపెట్టారు.అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు. అయితే ఈ ముగ్గురికి ఉగ్రవాద దాడికి ఉన్న సంబంధం ఏటనే విషయాలను కూడా అన్వేష ఈ వీడియోలో తెలిపారు.

మెహబూబ్‌ తిండికి తికానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు. అలాంటిది.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ‘నువ్వే కావాలి’ అనే వీడియో తీశాడు. అది కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మెక్సికో.. 4 దేశాలు తిరిగా ఆ వీడియో తీశాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ వీడియో కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే.

ఇక సోహెల్ విషయానికి వస్తే ఈయనకు పెద్ద ఎత్తున రెస్టారెంట్లు ఉన్నాయి .అలాగే సినిమాలను కూడా చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఇలా సినిమాలు చేయడానికి రెస్టారెంట్లు పెట్టడానికి డబ్బులు అన్ని కూడా ఉగ్రవాదులు ఇచ్చినవేనని తెలిపారు.పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కి కూడా దుబాయ్‌లోని హోటళ్లు, దుబాయ్‌లో షాపులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇండియాలో ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ కార్లు.. ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చాయి.

ఉగ్రవాదులు వీరితో కాంటాక్ట్ అయ్యి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున డబ్బులును ఇస్తున్నారు. అయితే వాళ్లు ప్రమోట్ చేస్తున్న ఆ యాప్ ఎవరు క్రియేట్ చేశారు ఏంటి అనే విషయాలు గురించి వారు ఆలోచించరు అందుకే ఈ యాప్స్ ఉపయోగించి ఎంతోమంది చనిపోయారని ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఈ ముగ్గురే కారణం” అంటూ సంచలన ఆరోపణలు చేశారు దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో పై మరి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.