Pawan kalyan : పవన్ ప్రాణాల మీదకు మితిమీరిన అభిమానం..ఇంత రచ్చ అవసరమా?

Pawan kalyan : ఏ సినిమా ఇండస్ట్రీలో కూడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల సహా తమిళ ఇండస్ట్రీలో హీరోలను వారి అభిమానులు దైవ సమానంగా కొలుస్తారు. అయితే ఈ అభిమానం ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా బయట పెట్టుకున్నారు. కానీ అదే అభిమానం మితి మీరితే దానికి పేరు కూడా పెట్టడానికి లేదు.. మరి ఇలాంటి అభిమానం ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.

తెలుగు రాష్ట్రాలలో పవన్ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు. అది చూసే పవన్ కూడా రాజకీయాల్లోకి వచ్చాడు. సరే అక్కడేమన్నా బాగుందా అంటే అదీ లేదు. కానీ అభిమానుల అత్యుత్సాహం మాత్రం ఎప్పుడు కనిపిస్తుంది. కానీ నిన్న జరిగిన సంఘటన మాత్రం ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. పవన్ తన పార్టీ పని మీద నరసాపురం కి వెళ్లగా అక్కడ జనం ఓ రేంజ్ లో వచ్చేసారు.

ఇక్కడే ఓ అభిమాని కారు పై ఉన్న పవన్ మీదకు దూకేసాడు. దీనితో పవన్ ఆ కారు మీదనే పడిపోయాడు. దీనితో ఈ ఘటన ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఇదేం అభిమానం అంటూ సదరు ఇతర పవన్ అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయాల్లో పవన్ కి పొరపాటున ఏమన్నా జరిగి ఉంటే? అనే ప్రశ్న కూడా ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారిపోయింది. దీనితో ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

మరి ఇంకొన్ని రోజుల్లో తాను నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ ఉంది. దీనిపై భారీ స్థాయి అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.