ఆన్‌లైన్‌ లో అప్పు .. వేధింపులు భరించలేక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

ఆన్‌లైన్ ‌లో అప్పులిస్తామంటూ వెంట పడతారు. తీసుకున్నాక, కాస్త ఇబ్బంది ఏమైతే చచ్చేదాకా వేధిస్తుంటారు. ఇలా వేధింపుల భరించలేక ఓ యువతి బలైపోయింది. ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా అవసరార్థం రుణాలు తీసుకున్న యువతి వాటిని తీర్చలేక మనస్తాపానికి గురై నిండు ప్రాణాన్ని తీసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటలో జరిగిందీ.

భార్య, కొడుకుని హత్య చేసి... కానిస్టేబుల్ ఆత్మహత్య

రాజగోపాలపేట కిర్ని మౌనిక ఖాత క్లస్టర్ పరిధిలో ఏఈవోగా పనిచేస్తోంది. ప్రస్తుతం వీరి కుటుంబం సిద్ధపేటలో ఉంటోంది. మౌనిక తండ్రి భూపాణి వ్యాపార ప్రయత్నాల్లో డబ్బులు నష్టపోయారు. దీంతో కుటుంబ అవసరాల కోసం ‘స్నాప్ ఇట్ లోన్’ యాప్ నుంచి రెండు నెలల క్రితం రూ. 3 లక్షల రుణం తీసుకుంది. అయితే, గడువు తీరినా ఆమె తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో యాప్ నిర్వాహకులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు.

అంతటితో ఆగక ఆమె ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ మౌనికను రుణ ఎగవేతదారుగా పేర్కొంటూ వాట్సాప్‌ మెసేజ్‌లు పంపించారు. రుణ సంస్థ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న తెల్లవారుజామున మౌనిక మృతి చెందింది.