ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుండి ఇంకో సర్ప్రైస్ రెడీ

ఫాన్స్ ని చాన్నాళ్లు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా చిరాకు తెప్పించిన ఫిలిం మేకర్స్ ఇప్పుడు రెగ్యులర్ అప్డేట్ ల కు రెడీ అవుతున్నారు. కొన్ని రోజులు క్రితం వచ్చిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ చాలా ట్రోల్ల్స్ కి గురైంది. కానీ 3D టీజర్ మాత్రం కొంచెం పర్లేదు అనిపించుకుంది.

టీజర్ లో జరిగిన తప్పుల్ని  గమనించిన మూవీ టీం ఈ సారి ప్రేక్షకులని డిసప్పోఇంట్ చెయ్యకుండా ఉండడానికి ఇంకో సర్ప్రైస్ కి రెడీ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23 న మరో బ్లాస్ట్ రెడీ కానున్నట్టు తెలుస్తుంది.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి గా, కృతి సనాన్ సీత గా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.