Kavya thapar: మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసి అరెస్ట్ అయిన….. ఏక్ మినీ కథ హీరోయిన్!

Kavya thapar: తెలుగులో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ కావ్య థాపర్ బాలీవుడ్ లో అవకాశాల కోసం ముంబై వెళ్లి అక్కడ ప్రయత్నాలు చేస్తోంది. ముంబై లోనే గురువారం ఫిబ్రవరి 17 న ఉదయం మద్యం తాగి కార్ డ్రైవ్ చేయడమే కాకుండా జే డబ్ల్యూ మరియాట్ హోటల్ దగ్గర యాక్సిడెంట్ చేసింది.

ఘటనలో అదృష్టవశాత్తు ఎవరు చనిపోలేదు కానీ ఒక వ్యక్తి గాయపడ్డాడు. ప్రమాదం చేయడమే కాకుండా పోలీసులతో వాదనకు దిగింది. కావ్య థాపర్ మద్యం మత్తులో మహిళా కానిస్టేబుల్ ను బూతులు తిడుతూ కాలర్ పట్టుకుని నానా గొడవ చేసింది. కావ్య థాపర్ ఈ మాయ పేరేమిటో సినిమా ద్వారా పరిచయమై ఏక్ మినీ కథా సినిమా లో నటించింది. OTT లో రిలీజ్ అయినా ఈ సినిమాలో నటనతో గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈ ఘటన తర్వాత పోలీస్ లు శుక్రవారం కావ్య థాపర్ ను అరెస్ట్ చేసి జూహు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ విధంగా పోలీసులు సదరు నటి అదుపులోకి తీసుకొని శుక్రవారం ఆంధేరీ కోర్ట్ లో హాజరుపర్చగా జ్యూడిషల్ కస్టడి విధించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరు మరణించలేదు.ఈ విధంగా నటి మద్యం సేవించి ఆ మత్తులో యాక్సిడెంట్ చేయటం వల్ల ఈ విషయం కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారి ఈ విషయంపై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.