NTR: నందమూరి నటసింహం బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఈ అవార్డును ప్రకటించడంతో ఎంతోమంది అభిమానులు నందమూరి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు అయితే కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాను విడుదల చేయడంతో వెంటనే ఈ జాబితాలో బాలకృష్ణ పేరు ఉండటంతో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరూ కూడా తన బాబాయ్ బాలకృష్ణకు అభినందనలు తెలియజేస్తూ పోస్టులు చేశారు.
గత కొంతకాలంగా బాలకృష్ణ వీరిద్దరిని దూరం పెడుతూ ఉన్నప్పటికీ వీరు మాత్రం తన బాబాయ్ అంటే ఎంతో గౌరవం ప్రేమతో ఎప్పటికప్పుడు తన బాబాయికి సంబంధించిన అన్ని విషయాలపై స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. గతంలో బాలకృష్ణ ఎన్నికలలో విజయం సాధించడంతో ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ఇలా ఎప్పటికప్పుడు బాలయ్యను ఎంతో గౌరవిస్తూ ఉన్నప్పటికీ బాలకృష్ణ మాత్రం వీరిద్దరిని దూరం పెడుతూ వస్తున్నారు.
తాజాగా మరోసారి నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరినీ అవమానించారని చెప్పాలి. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి బాలకృష్ణకు అభినందనలు తెలియజేస్తూ పేపర్ యాడ్ ఇచ్చారు. ఇందులో భాగంగా నందమూరి కుటుంబ సభ్యులందరి పేర్లను పొందుపరిచారు.
ఇలాంటి నందమూరి కుటుంబ సభ్యులందరి పేర్లను ప్రచురించినప్పటికీ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ పేర్లను మాత్రం ఎక్కడ ప్రచురించకపోవడంతో మరోసారి నందమూరి కుటుంబ సభ్యులు వీరిద్దరిని అవమానించారని అభిమానులు ఫీల్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్ తండ్రి అయినటువంటి హరికృష్ణ తన తల్లి శ్రీలక్ష్మి పేర్లను కూడా ప్రచురించారు కానీ హరికృష్ణ రెండో భార్య అయిన శాలిని తన కుమారుడైన ఎన్టీఆర్ పేర్లను మాత్రం ప్రకటించకపోవడంతో నందమూరి కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ ను తమ కుటుంబ సభ్యునిగా స్వాగతించలేకపోతున్నారు అంటూ మండిపడుతున్నారు.