Bhalakrishana – Vijaya Shanthi: నెరవేరుతున్న అభిమానుల కల…బాలయ్య, విజయశాంతి కాంబినేషన్ లో సినిమా.. నిజమెంత?

Bhalakrishana – Vijaya Shanthi: ప్రస్తుతం అగ్ర హీరోలు ఒకప్పటి హీరోయిన్ లతో కలిసి నటించడానికి ఆసక్తి చూపడం లేదు. ఎక్కువగా నేటితరం హీరోయిన్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం అగ్ర హీరోలుగా ఉన్న హీరోలకు జోడిలుగా అప్పటి హీరోయిన్ లు పదుల సంఖ్యలో సినిమాల్లో నటించారు. హీరోయిన్ విజయశాంతి, బాలకృష్ణ కాంబినేషన్ లో అప్పట్లో ఏకంగా 17 సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మొదట కథానాయకుడు సినిమా వచ్చింది. ఆ తర్వాత చివరగా నిప్పురవ్వ సినిమాలో కలిసి నటించారు. ఇది ఇలా ఉంటే దాదాపుగా మూడు దశాబ్దాల తరువాత బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని, ఒక పాత్రలో ఫ్యాక్షనిస్ట్ గా, మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య కనిపించబోతున్నారని సమాచారం. ఇందులో తండ్రీకొడుకులుగా బాలయ్య కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. అప్పట్లో వివి వినాయక్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణ, ఫ్యాక్షనిస్టుగా, పోలీస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు పోలికలు మినహా మరే పోలికలు ఉండవని సమాచారం.

అయితే ఈ విషయంపై విజయశాంతి నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. బాలయ్య, విజయశాంతితో కలిసి నటించాలని బాలయ్య అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు.మరి బాలయ్య అభిమానులు కోరుకుంటున్న విధంగా విజయశాంతి, బాలకృష్ణ కాంబినేషన్ లో మరొకసారి సినిమా రాబోతోందా? వీరిద్దరూ కలిసి నటించబోతున్నారా? బాలయ్య అభిమానుల కోరిక నెరవేరనుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి. ఇలా ఉంటే విజయశాంతి ఇటీవలే మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత ఆమె మరే సినిమాలో నటించలేదు.