ఒకేరోజున చిరు, బాలయ్య మాస్ సినిమాల నుంచే ఓకే అప్డేట్స్..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర దిగ్గజ హీరోలు మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ లు కూడా ఒకరు. మరి ఇద్దరి మధ్య ఒకప్పుడు గట్టి పోటీ బాక్సాఫీస్ దగ్గర ఉండేది కానీ తర్వాత పరిణామాలు మారడంతో మెగాస్టార్ మార్కెట్ భారీగా పెరిగింది. బాలయ్యది కూడా గట్టిగానే ఉంది కానీ దానికి భారీ హిట్ టాక్ వచ్చి పెద్ద హిట్ కావాల్సి ఉన్నాయి.

కానీ చిరు సినిమాలకి మినిమమ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ కానీ ఇప్పుడు గాడ్ ఫాదర్ తో అయితే చిరు మార్కెట్ బాగా దెబ్బ తిన్నది అని క్లారిటీ వచ్చింది. ఇక ఇదిలా ఉండగా సినిమాలతో అయితే మళ్ళీ పెద్దగా క్లాష్ ఇద్దరికీ రాలేదు కానీ ఇప్పుడు ఒకే రోజున అయితే ఇద్దరి సినిమాల నుంచి ఒకేలాంటి అప్డేట్స్ లాక్ అవ్వడం ఆసక్తిగా మారింది.

ఇప్పుడు బాలయ్య తన కెరీర్ లో 107వ సినిమా అలాగే మరో పక్క చిరు తన కెరీర్ లో 154వ సినిమాలు చేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు అయితే టైటిల్స్ ఇంకా బయటకి రాలేదు. మరి ఇవి అయితే ఈ దీపావళి కానుకగా రివీల్ చేయబోతున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడు నుంచో ఈ సినిమాలకి టైటిల్స్ ఏంటి అనేవి ఆసక్తిగా మారాయి.