ఈ నెల 29న మొగల్తూరులో రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ

 ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్  ప్రశాంతి

రెబల్ స్టార్ స్వర్గీయ  కృష్ణంరాజు  సంస్మరణ సభ ఈ నెల 29న మొగల్తూరు జరగనుంది. ఈ సంస్మరణ సభకు పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ రాక సందర్బంగా మంగళవారం పచ్ఛిమ గోదావరి జిల్లా కలెక్టర్  ప్రశాంతి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా  ఇదే సమయంలో  మొగల్తూరులోని మెగాస్టార్ చిరంజీవి పూర్వపు ఇల్లును సైతం సందర్శించారు. ఆమె వెంట నరసాపురం డి.ఎస్.పి వీరాంజనేయరెడ్డి ఉన్నారు.