‎OG: తెలంగాణలో భారీగా పెరిగిన పవన్ ఓజీ సినిమా టికెట్ రేట్లు.. బెనిఫిట్ షో టికెట్ ఎంతో తెలుసా?

‎OG: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇది ఇలా ఉంటే ఓజీ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.

‎ఓజీ సినిమా బెనిఫిట్ షోను 24వ తేదీ 9 గంటలకు మొదలు కానుంది. ఈ షోకి రూ.800 టికెట్ రేట్‌ తో ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటు రూ.100 అలాగే మల్టీప్లెక్స్‌ లలో రూ.150 నిర్దారించింది. అయితే ఈ ధరలు ఈనెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి.

‎ఇక ఓజీ సినిమాపై ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా పవన్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మూవీ విడుదల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచడంపై పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మూవీ టీం తెలంగాణ సర్కార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు మూవీ మేకర్స్. అయితే కొంతమంది సినిమా టికెట్లు రేట్లు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ఉన్న వారు చూస్తారు కానీ సామాన్యుల పరిస్థితి ఏమిటి? అంత పెద్ద మొత్తంలో టికెట్ కొని సినిమాలు చూడాలంటే ఫ్యామిలీలో పరిస్థితి ఏంటి అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఓజి సినిమాపై అభిమానులు బోలెడు అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.