Balakrishna vs Pawan: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూనే మరొకవైపు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ నాయకుడిగా బాధ్యతలను చూసుకుంటూనే మరొకవైపు వరస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అటు సినిమాలు ఇటు రాజకీయాలు ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు ఈ ఇద్దరు స్టార్ హీరోలు. ఇకపోతే ఈసారి అనగా 2025లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ కు తెర లేవనుంది. ఈసారి దసరా పండుగకు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీపడుతున్నాయి.
అందులో ఒకటి పవర్ స్టార్ ఓజీ చిత్రం కాగా, మరొకటి నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ 2 చిత్రం. ఈ రెండు సినిమాలు కూడా 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలు పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా సంగతి పక్కన పెడితే బాలయ్య బాబు సినిమాపై ఇప్పటికే బోలెడు అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. దానికి తోడు తాజాగా బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. కాగా పవన్ నటిస్తున్న ఓజీ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథనాయిక.
శ్రియా రెడ్డి కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్మెంట్స్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అఖండ చిత్రానికి సీక్వెల్‌గా అఖండ 2 చిత్రం తెరకెక్కుతోంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరపుకుంటోన్న ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా సక్సెస్ కానుంది బాలయ్య వర్సెస్ పవన్ కళ్యాణ్ లలో ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి అంటే దసరా వరకు వేచి చూడాల్సిందే మరి.
