ఏకంగా రష్మి మీదే కన్నేసిన నూకరాజు తండ్రి.. ఏమన్నాడో తెలుసా..?

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో రష్మీ కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో కి గత కొన్ని సంవత్సరాలుగా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ అందాల యాంకర్ తన ముద్దు ముద్దు మాటలతో పాటు తన అందాలతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన రష్మీ, జబర్దస్త్ ద్వారా యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది. రష్మి ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా ఈ టీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కమెడియన్ లతోపాటు వారి తండ్రులు కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో సందడి చేశారు. ఇదివరకే జబర్దస్త్ కమెడియన్ లు వారి కుటుంబ సభ్యులతో జబర్దస్త్ స్టేజ్ మీద సందడి చేశారు. ఇటీవల ఫాదర్స్ డే ఈ సందర్భంగా మల్లెమాల వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమెడియన్ల తండ్రులు కూడా సందడి చేశారు. ఈ క్రమంలో బుల్లెట్ భాస్కర్ తండ్రి స్టేజ్ మీదకు రాగానే బుల్లెట్ భాస్కర్ మీద సెటైర్లు వేసాడు. ఇంట్లో ఉన్న కుక్కనే కంట్రోల్ చేయలేకపోతోన్నా.. ఇక వీధుల్లో ఉండే కుక్కలను ఏం కంట్రోల్ చేస్తాను అని అంటాడు. అంటే నన్ను కుక్కతో పోల్చుతున్నావా? అని బుల్లెట్ భాస్కర్ అడగగా.. గట్టిగా అరవకు అవి వింటే ఫీల్ అవుతాయి అంటూ పంచ్ వేసాడు.

ఇక ఈ కార్యక్రమంలో కమెడియన్ నూకరాజు తండ్రి కూడా చేశాడు. ఈ క్రమంలో..నాన్న మీరు రత్తాలు ఇంటికి వెళ్తే కొట్టారట ఎందుకు? అని నూకరాజు అడుగుతాడు . డోర్ కొట్టినందుకు కొట్టారురా అని ఆయన తండ్రి అంటాడు. డోర్ కొడితే ఎందుకు కొడతారు.. అయినా కాలింగ్ బెల్ కొట్టొచ్చు కదా? అని నూకరాజు అంటే.. బాత్రూం డోర్‌కు కాలింగ్ బెల్ ఎందుకు పెట్టుకుంటారురా? అని నూకరాజు తండ్రి కౌంటర్ వేస్తాడు. తర్వాత మరో సందర్భంలో రష్మీ కోసం వచ్చానని అంటాడు. ఇంకో సందర్భంలో రష్మి ని చూస్తూ.. అదిరిపోయింది అని అంటాడు. కానీ మళ్ళీ సేమ్య అదిరిపోయింది అంటూ నూకరాజు తండ్రి కవర్ చేసేస్తాడు.