Ntr: ఫుల్ జోష్ మీద ఉన్న ఎన్టీఆర్.. వరుసగా సినిమాలు?

Ntr: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం దాదాపుగా మూడేళ్లపాటు సమయాన్ని కేటాయించాడు.

ఈ సినిమా చేస్తున్న సమయంలో మరే ప్రాజెక్టు లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఇదే సినిమాను చేస్తూ మూడేళ్ల పాటు వెయిట్ చేశాడు. ఇక 2018లో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. అరవింద సమేత సినిమాతోనే చివరిసారిగా థియేటర్లో సందడి చేసిన ఎన్టీఆర్, త్వరలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే మూడేళ్ల పాటు మరే సినిమాలు చేయకుండా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చేయనున్న ఆ క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక అందులో భాగంగానే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఎన్టీఆర్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగానే పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కెరీర్లో ఇది 30వ సినిమా. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాని, అలాగే చిత్రం శ్రీనివాస్ దర్శకత్వంలో మరొక ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఒక సినిమాను పట్టాలు ఎక్కించేందుకు తారక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.