అన్న కళ్యాణ్ రామ్ ను ఆదుకునే పనిలో ఎన్టీఆర్

NTR trying hard to establish Kalyan Ram as big producer
NTR trying hard to establish Kalyan Ram as big producer
అన్న కళ్యాణ్ రామ్ అంటే ఎన్టీఆట్ కు మంచి అభిమానం. మొదట్లో కొద్దిగా దూర దూరంగానే ఉంటూ వచ్చిన ఈ ఇద్దరూ పరిస్థితుల ప్రభావంతో ఒక్కటయ్యారు. ఒకరికొకరు అన్నట్టు ఉంటున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ నెలకొల్పిన సినీ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకే ఎన్టీఆర్ తనవంతు కృషి చేస్తున్నారు.
 
ఎన్టీఆర్ ఆర్ట్స్ స్థాపించిన కళ్యాణ్ రామ్ మొదట్లో పెద్దగా లాభాలు వచ్చే సినిమాలేవీ చేయలేదు. పెద్ద హీరోలతో సినిమాలు చేసే పొజిషన్ కూడ లేదు.  అందుకే ఎన్టీఆర్ అన్న బ్యానర్లో ‘జైలవకుశ’ సినిమా చేసి ఆదుకున్నాడు.  
 
ఎన్టీఆర్ అంతటితో ఆగిపోలేదు.  బ్యానర్ ను మంచి స్థాయిలో నిలబెట్టడానికి తాను చేస్తున్న సినిమాలు అన్నింటిలోనూ భాగస్వామ్యం ఇప్పిస్తున్నారు.  ఎన్టీఆట్ తర్వాత సినిమాలు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉండబోతున్నాయి. కొరటాల శివ చిత్రం త్వరలో మొదలవుతుంది.
 
ఈ సినిమా నిర్మాణంలో అన్న కళ్యాణ్ రామ్ కు భాగస్వామ్యం ఇప్పించాడు ఎన్టీఆర్.  అంతేకాదు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయాల్సిన చిత్రాన్ని కూడ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించేలా ఏర్పాట్లు చేశారు. ఈ రెండు భారీ సినిమాలతో కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాగా బలపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా అన్నను ఆర్థికంగా నిలబెట్టడానికి ఎన్టీఆర్ బాగానే శ్రద్ధ చూపుతున్నాడు.