NTR: ఈ మధ్యకాలంలో సినిమాకు, భాషకు మధ్య ఉన్న బంధం తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలోనే హీరోలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇకపోతే టాలీవుడ్ లో పలువురు హీరోలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మిగిలిన భాషల్లో కూడా వారి టాలెంట్ ని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాల రెండు మొదలైనప్పటి నుంచి సినిమాలు భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను, అన్ని రకాల భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొంతమంది హీరోలు ఇతర ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి సైతం మొగ్గు చూపుతున్నారు.
మరీ ముఖ్యం గా చెప్పాలి అంటే టాలీవుడ్ హీరోలు ఎక్కువగా బాలీవుడ్ లో స్ట్రెయిట్ ఫిలిమ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇక తాజాగా టాలీవుడ్ లో మరో హీరో అదే బాటలో నడవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అందుకు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకుర్చాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో మొదటిసారిగా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలు డబ్బింగ్ అయ్యి బాలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి.
కానీ టెక్నికల్ గా ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ అని చెప్పవచ్చు.ఆర్ఆర్ఆర్ జనవరి 7న విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమా చిత్ర బంధం ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ ఒక బాలీవుడ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నేరుగా హిందీ సినిమాల్లో ఎప్పుడు నటిస్తారని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా.. ఆ విషయంపై స్పందించిన ఎన్టీఆర్.. నేను కూడా బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను.ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితులు మారి అవకాశాలు రావచ్చు అని ఆశిస్తున్నాను అని తెలిపారు.