ఎన్టీఆర్ భారీ సినిమా ఇంకా లేట్ గా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ భారీ సినిమా రాజమౌళితో కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే దీని తర్వాత తారక్ అదిరే టెలివిజన్ షో ఎవరు మీలో కోటీశ్వరులు కూడా చేస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తన భారీ సినిమా దర్శకుడు కొరటాల శివతో సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ కోసం ఎప్పుడు నుంచో అంతా ఎదురు చూస్తున్నారు.

ఇది ఈ నవంబర్ కానీ డిసెంబర్ కానీ మొదలువుతుంది అని అంతా అనుకున్నారు కానీ ఈ చిత్రం మరింత లేట్ అయ్యేలా కనిపిస్తుంది. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రం షూట్ ఏకంగా ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యిందట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ ని సంగీతం కి అనుకుంటుండగా.. నందమూరి కళ్యాణ్ రామ్ పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.