RRR Movie : “RRR” లో నిజంగా ఎన్టీఆర్ కి అన్యాయం చేసారా? వైరల్ అవుతున్న ప్రూఫ్.!

RRR Movie : పాన్ ఇండియాస్ మెగా బ్లాక్ బస్టర్ మూవీ ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా చేసిన ఈ సినిమాని ఇండియాస్ నెంబర్ 1 దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు.
అయితే ఇది మన టాలీవుడ్ లో ఒక ఉన్నతమైన మల్టీ స్టారర్ అని చెప్పాలి.
మెగా, నందమూరి కుటుంబాల నుంచి ఇద్దరు స్టార్ హీరోలని ఒకే సినిమాలో చూపించడం అనేది చిన్న విషయం కాదు. అయితే ఈ ఇద్దరి హీరోస్ లో ఒకింత మాస్ క్రేజ్ ఎన్టీఆర్ కే ఉంది అనే మాట వాస్తవం. అలా అని చరణ్ కి తక్కువ అనేం కాదు.
అలాగే ఈ సినిమా విషయానికి వస్తే పరిస్థితులు మారాయి.
ఈ సినిమాలో మొదటి నుంచి రామ్ చరణ్ పాత్రని హైలైట్ చేస్తూ అప్డేట్స్ స్టార్ట్ చెయ్యడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చకపోవడంతో వారు చాలానే ఆందోళన చెయ్యగా అక్కడ నుంచి చిత్ర బృందం ఎక్కవగా ఎన్టీఆర్ అప్డేట్స్ ముందు ఇవ్వడం స్టార్ట్ చేశారు.
అక్కడ నుంచి మెయిన్ హీరో ఎవరు అనే దానిపై అలా చర్చ స్టార్ట్ అయ్యింది సినిమా రిలీజ్ అయ్యాక ఒకింత చరణ్ పాత్రదే పై చేయి అని అందరికీ క్లియర్ అయ్యింది. దీనితో అక్కడ నుంచి ఎన్టీఆర్ పాత్రకి అన్యాయం చేసారని తగ్గించి చూపించారని చాలానే కామెంట్స్ వచ్చాయి.
అయితే వాటికి చిత్ర యూనిట్ అలా ఏమి లేదు అంటూనే వచ్చారు కానీ ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన నటి అంజుమ్ పెట్టిన రీసెంట్ పోస్ట్ తో ఎన్టీఆర్ రోల్ పై కథని తక్కువ చేసారని అర్ధం అయ్యిపోయింది.
ఈ సినిమాలో తమపై ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉన్నాయి కానీ అవి సినిమాలో యాడ్ చెయ్యలేదు అవన్నీ నాకు చాలా ఇష్టం అని ఆమె తెలిపింది.
దీనితో చరణ్ పై ఫ్లాష్ బ్యాక్ ని చూపించారు కానీ ఎన్టీఆర్ పై సీన్స్ మాత్రం తీసేశారని మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాపోతున్నారు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
https://twitter.com/AhmareenAnjum/status/1513800078372220931?s=20&t=dm5Sv1dOsHlluy2lUrhXiw