అలాంటి వాటి జోలికి వెళ్ళద్దంటూ కొరటాలకు కండిషన్ పెట్టిన ఎన్టీఆర్…?

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్అర్ సినిమాలో నటించిన ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. ఈ సినిమా తర్వత ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకతవంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30 సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ 30 సినిమా స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ నటించనున్న తదుపరి సినిమా ఎన్టీఆర్ 30 సినిమా క్లైమాక్స్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉండటంవల్ల క్లైమాక్స్ లో నాలుగైదు వెర్షన్ లు మళ్లీ రాస్తున్నట్లు సమాచారం. ఆచార్య సినిమా డిజాస్టర్ కావటంతో కొరటాల ప్రతీ విషయంలోనూ ఆచి,తూచి అడుగులు వేయాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఆచార్య సినిమా కథ, స్క్రీన్ ప్లే తో పాటు అన్ని పనులు కొరటాల దగ్గరుండి చూసుకున్నారు. అందువల్ల సినిమా మేకింగ్ మీద కాన్సర్టేట్ చేయకపోవటంతో సినిమా ప్లాప్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్ల ఎన్టీఆర్ తన సినిమా విషయంలో ప్రొడక్షన్, సినిమా బిజినెస్ వంటి ఇతర ఏ విషయాలలో కూడ కొరటాల శివ ఇన్వాల్వ్ కాకూడదని ఎన్టీఆర్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ ఈ సినిమాని కూడ పార్టీ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందువల్ల ఈ సినిమా స్టోరీ విషయంలో దర్శకుడు కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి డైలాగ్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ కి అన్నీ భాషలలోను మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఒక కొత్త మేకోవర్ ని ట్రై చేస్తున్నారని సమాచారం. ఇందు కోసం 8 నుంచి 9 కేజీలు బరువు కూడా తగ్గుతున్నారట. ఇక ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనున్నట్టు వినికిడి.