హాలీవుడ్ వెబ్ సైట్లో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ..ఇప్పుడే ఎందుకు వదిలారు ?

NTR PR team promotions for RRR
NTR PR team promotions for RRR
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డెడ్ లైన్ అనబడే హాలీవుడ్ వెబ్ సైట్ కు చాన్నాళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది.  తారక్ పీఆర్ బృందాలు ఆ ఇంటర్వ్యూను బాగా ప్రచారం చేస్తున్నారు.  ఎక్కడ చూసినా ఆ ఇంటర్వ్యూ తాలూకు విశేషాలే. వాటిలో ప్రధానంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సంగతులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజమౌళి పనితనం గురించి, సినిమాలోని పోరాట సన్నివేశాలు, కీలకమైన సీక్వెన్సెన్ గురించిన విషయాలను తారక్ ఎంతో క్షుణ్ణంగా వివరించడం జరిగింది.  నిజానికి ఇవేవీ కొత్త విషయాలు కావు.  చాన్నాళ్ళుగా తెలుగు మీదుయాలో వస్తున్నవే.  
 
కానీ హాలీవుడ్ వెబ్ సైట్ ఇంటర్వ్యూ అనగానే అభిమానులు, నెటిజన్లలో ఎక్కడా లేని ఆసక్తి మొదలైంది.  పాత విశేషాలనే కొత్తవిగా చర్చకు పెట్టారు.  దీన్నిబట్టి ఇది పక్కా ప్రమోషన్ స్టంట్ అని అర్థమవుతూనే ఉంది.  ఇక కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల గురించిన చర్చ కూడ ఉంది.  ఏయే ప్రాజెక్ట్స్ ఏ దశలో ఉన్నది రివీల్ చేశారు.  ఎప్పుడో జరిగిన ఇంటర్వ్యూకు ఈ కొత్త సంగతులను జోడించారు.  మొత్తానికి తారక్ వైపు నుండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ప్రమోషన్లు మొదలయ్యాయనే అనుకోవాలి.  ఇకపోతే ఇటీవలే కరోనాకు గురైన తారక్ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు.