NTR: సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన బాల నటుడి గానే పలు సినిమాలలో నటించి మెప్పించారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈయన రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇలా పార్టీని పెట్టిన ఎనిమిది నెలలలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఎన్టీఆర్ తర్వాత ఈ పార్టీ నందమూరి వారసులకు కాకుండా నారావారి చేతులలోకి వెళ్ళింది.
ఈ క్రమంలోనే ఎంతోమంది ఎన్టీఆర్ కి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి రాజకీయాలలోకి వచ్చారంటూ కూడా ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఎన్టీఆర్ తీసుకోవాలి అంటూ కూడా అభిమానులు డిమాండ్ చేశారు.
ఇకపోతే ఎన్టీఆర్ 2009 ఎన్నికల సమయంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారే తప్ప అప్పటి నుంచి మరోసారి తెలుగుదేశం పార్టీ కోసం కానీ ఎన్నికల సమయంలో ప్రచారం కోసం కానీ ఎన్టీఆర్ ముందుకు రాలేదు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చిత్తగా ఓడిపోవడంతో ఈ పార్టీని నిలబెట్టాలి అంటే కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యమవుతుందని ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలి అంటూ అభిమానులు కూడా కోరారు.
ఇలా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడం చంద్రబాబు నాయుడుకు బాలయ్యకు కూడా ఇష్టం లేదనే చెప్పాలి దీంతో ఈయన మరో పార్టీ కనక పెడితే కచ్చితంగా రాజకీయాలలో సక్సెస్ అవుతారని అందరూ భావిస్తున్నారు ఈ క్రమంలోనే తన భార్య లక్ష్మీ ప్రణతి ద్వారా ఈయన రాజకీయాలలోకి రాబోతున్నారంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది.
లక్ష్మీ ప్రణతి చేత పెద్ద ఎత్తున బిజినెస్ చేయించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ బిజినెస్ లో ఎక్కువగా ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎన్టీఆర్ జాగ్రత్త పడుతున్నారట ఇలా ఈ బిజినెస్ ద్వారా ఆయన కూడా నిత్యం ప్రజలలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని ఇలా ప్రజలలో మమేకమైన తర్వాత ఈయన తిరిగి రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వినపడుతున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.